Former Deputy Chief Minister and Station Ghanpur MLA Kadiyam Srihari urged the Telangana government to simplify the beneficiary

POLITICAL

Former Deputy Chief Minister and Station Ghanpur MLA Kadiyam Srihari urged the Telangana government to simplify the beneficiary selection process for the Indiramma Housing Scheme. During a review meeting chaired by Minister Ponguleti Srinivas Reddy in Hyderabad, he requested modifications to the L1, L2, and L3 beneficiary lists and sought housing opportunities for multiple families living in the same house during the second phase.

He also demanded faster release of final housing bills, formation of assignment committees for distribution of house sites to poor families, resolution of forest land disputes affecting farmers near Devunoor hills, and provision of ration and pension services in newly formed gram panchayats. Additionally, he called for speedy procurement and transportation of paddy and maize to avoid inconvenience to farmers.


ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను సరళతరం చేయాలి…..

L1,L2, L3 లిస్ట్ లను మాడిఫై చేయాలి….

ఒకే ఇంట్లో 2,3కుటుంబాలు ఉన్న వారికి రెండో విడతలో అవకాశం కల్పించాలి…..

ఇళ్ల నిర్మాణం పూర్తి అయినప్పయికి ఫైనల్ బిల్ రావడం లేదు….

త్వరితగతిన ఫైనల్ బిల్ చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి…..

ఇంటి స్థలం లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అసైన్ మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలి….

దేవునూరు గుట్టల చుట్టూ ఉన్న పట్టా రైతులకు ఫారెస్ట్ శాఖ మధ్య ఉన్న భూ సమస్యలపై నిర్ణయం తీసుకోవాలి….

కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీలలోనే రేషన్, పెన్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి…..

ధాన్యం కొనుగోళ్లు, రవాణాలో జాప్యాన్ని నివారించాలి….

ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి…..

ఎంతో గొప్ప పథకం అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలను, లబ్ధిదారుల ఎంపికను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

హైదరాబాద్ లోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్థావించారు.

ఇందిరమ్మ ఇండ్లు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలను సరళతరం చేయాలని తెలిపారు. ఒక లబ్ధిదారునికి సాంక్షన్ ప్రొసీడింగ్ ఇవ్వడానికి 4సార్లు సర్వే చేస్తున్నారని అన్నారు. గతంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కోసం L1, L2,L3 లిస్ట్ రూపొందించామని కానీ ఈ కేటగిరిలలో చాలా లోపాలు ఉన్నాయని వెల్లడించారు. ఒక తండ్రికి ఇద్దురు, ముగ్గురు కుమారులు ఉండి ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబాలకు రెండో విడతలో అవకాశం కల్పించే విధంగా నిబంధనలలో మార్పులు చేయాలని సూచించారు. అలాగే చాలా మంది లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం పూర్తి అయి గృహ ప్రవేశం చేసినప్పటికి ఫైనల్ బిల్ రావడం లేదని తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే ఫైనల్ చిల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇళ్ల స్థలాల పంపిణికి అసైన్ మెంట్ కమిటీ ఏర్పాటు

ఇంటి స్థలం లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణి చేసేందుకు అసైన్ మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. చాలా గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికి అసైన్ మెంట్ కమిటీ లేకపోవడం వల్ల ఇళ్ల స్థలాల పంపిణి చేయలేక పోతున్నామని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కు ఇళ్ల స్థలాలు పంపిణి చేసే విధంగా ఎమ్మెల్యేలు లేదా కలెక్టర్ చైర్మన్ గా అసైన్ మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే 40నుండి 50గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయని ఒక్కో గ్రామంలో 3నుండి 4ఎకరాల స్థలం ఉందని వీటిలో ఇళ్ల పట్టాలు పంపిణి చేసి ఇందిరమ్మ కాలనీలు నిర్మాణం చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఫారెస్ట్, పట్టా రైతుల భూ సమస్యల పరిష్కారం

దేవునూరు గుట్టల చుట్టూ 4,5గ్రామాల పట్టా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు నోటిఫికేషన్ లో లేని పట్టా భూములను కూడా ఫారెస్ట్ భూమిగా పరిగనిస్తున్నారని దింతో పట్టా రైతులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య భూ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీనిపై వీలైనంత తొందరలో పట్టా రైతులు, ఫారెస్ట్ శాఖ భూ సమస్యపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

నూతన గ్రామ పంచాయతీలలోనే రేషన్, పెన్షన్ పంపిణి చేయాలి

రాష్ట్రంలో అనేక నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడినప్పటికి ఇప్పటికి కూడా పాత గ్రామ పంచాయతీలలో రేషన్, పెన్షన్ ఇస్తున్నారని దింతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొత్త గ్రామ పంచాయితీలలో నూతన రేషన్ షాప్ లు ఏర్పాటు చేయాలని లేకపోతె కొత్త గ్రామ పంచాయితీలలోనే రేషన్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. అలాగే పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులును గుర్తించి కొత్త గ్రామ పంచాయితీలలో పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని అన్నారు.

ధాన్యం కొనుగోళ్లు, రవాణాను వేగవంతం చేయాలి

మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో కంటాలో, రవాణాలో జాప్యం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ధాన్యం గోదాములకు తరలింపును వేగవతం చేయాలని అన్నారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో కంటా అయి 2వేల 3వేల బస్తాలు ఉన్నాయని రైతులు 10, 15రోజులు ఎదురుచూడాల్సి వస్తుందని తెలిపారు. కావున ధాన్యం రవాణా, కొనుగోళ్లను వేగవంతం చేసే విధంగా తక్షిణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *