
BRS Working President K.T. Rama Rao attended the party’s General Body meeting in Vikarabad and guided leaders on SIR and party membership enrollment.

KTR praised Vikarabad’s natural beauty and alleged that the Congress government failed to fulfil its promises. He highlighted BRS welfare schemes, farmer support initiatives, electricity supply, and development works carried out during the previous government.

KTR said BRS will continue its fight for Telangana’s development and expressed confidence that KCR will return as Chief Minister in 2028.

వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీ ఆర్ ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….
ఎస్ ఐ ఆర్, పార్టీ సభ్యత్వ నమోదు పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్..
కేటీఆర్, బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
జ్వరం ఉన్నా వికారాబాద్ కి వచ్చాను ఇక్కడి గాలి పీల్చుకుంటే ఉన్న రోగాలు పోతాయి
అద్భుతమైన పర్యాటక కేంద్రం వికారాబాద్
ఇక్కడ నీరు, గాలి, ప్రకృతి అన్ని ఔషధాలే
మోసపోతే గోసపడుతారు అని కేసీఆర్ చెప్పారు ఇప్పుడు అదే జరుగుతుంది
వికారాబాద్ ప్రజలకు మంచి చేయాలని అభివృద్ధి చేయాలని మెతుకు ఆనంద్ ఆలోచించారు
అలాంటి నాయకుణ్ణి మనం ఒడిగొట్టుకున్నాం
కేసీఆర్ అప్పులు చేసి పోయాడు అని స్పీకర్ చెబుతున్నాడు
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఇలాంటి మాటల వల్ల మీ గౌరవం తగ్గుద్ది తప్ప పెరగదు
కేసిఆర్ చేసిన అప్పు పార్లమెంట్ వేదికగా లెక్కలు బయటపెట్టారు
2014 లో అధికారంలోకి వచ్చాక 72 వేల కోట్లు
కెసిఆర్ దిగిపోయాక ఉన్న అప్పు 3 లక్షల 52 వేల కోట్లు కొత్తగా చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు మాత్రమే
కెసిఆర్ ఉన్నప్పుడు దొరికిన యూరియా ఇప్పుడు ఎందుకు దొరకడం లేదు
కెసిఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇప్పుడు కరెంట్ కోతలు రైతు బంధు టైం కి వస్తుండే రైతు రుణమాఫీ జరిగింది
రుణమాఫీ రెండు లక్షలు తీసుకోండి మేం వస్తె మాఫీ చేస్తాం అన్నారు
కౌలు రైతులకు, కూలీలకు కూడా ఇస్తాం అన్నారు
రైతు బంధు ఎందుకు బంద్ అవుద్ది మేమేం అన్న దివానాగలమా అన్నాడు ఇప్పుడు ఏమని పిలవాలి
దొంగ మాటలు దగుల్బాజీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు
అప్పులపాలు అయింది అంటున్నారు కేసీఆర్ చేసిన అప్పుల ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు
కెసిఆర్ మెడికల్ కాలేజీలు తెచ్చారు, గురుకులాల సంఖ్య పెంచారు
పింఛన్లు పెంచారు , 24 గంటల కరెంట్ రైతులకు ఇచ్చిన మొగాడు మొనగాడు కెసిఆర్
అంధకారంలో ఉన్న తెలంగాణ ను అభివృద్ధి పథంలో నడిపించారు కేసీఆర్
వంద రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నారు
రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
సిగ్గులేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
కాంగ్రెస్ తప్పులు ప్రజలు లెక్కపెడుతున్నారు తొందరోనే ఖేల్ ఖతం దుకాణం బంద్ అవుతుంది
కేసులు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు ఎన్ని కేసులు ఎక్కువ అయితే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు
2028 లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు
అందుకే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే దోచుకుందాం అనుకుంటున్నారు
పోలీసులు డ్యూటీ చేయండి అతి చేయకండి రేపు మేం అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఉన్న బయటికి తీసుకువచ్చి మిత్తితో కలిపి చెల్లిస్తాం
దామగుండం లో నేవీ ర్యాడా ర్ కి భూములు అడిగితే మనం ఇవ్వలేదు
12 లక్షల చెట్లు కొడతారు అని కేసీఆర్ ఇవ్వలేదు
రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం
మోడీ అడిగిన వెంటనే 2900 ఎకరాలు అప్పజెప్పారు
మూసి నీ బాగు చేస్తాం అని ఇక్కడ చెట్లు కొట్టేస్తున్నాడు మూసి అభివృద్ధి చేస్తా అంటే మనం ఎలా నమ్మాలి
బిజెపి కాంగ్రెస్ ఇద్దరు కలిసి మూసికి ఉరేస్తున్నారు
వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో 10 వేల ఎకరాలకు నీళ్లు అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు
90 శాతం పనులు పూర్తి చేశాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు పక్కన పెట్టారు
పాలమూరు రంగారెడ్డి పూర్తయితే కేసీఆర్ గుర్తు వస్తారని అభివృద్ధి ఆపేశారు
స్పీకర్ దృతరాష్ట్రుడు అయ్యాడు మన ఎమ్మెల్యేలు పార్టీ మారితే కండువాలు కప్పుకొని ప్రచారం చేసిన కనిపించడం లేదట
రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు భూములు మింగుతున్నారు
కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి
284 పోలింగ్ బూతుల్లో 10 మందితో 2840 కమిటీలు వేసుకున్నారు మంచి పరిమాణం
సభ్యత్వ నమోదు అందరూ తీసుకోవాలి
మెంబర్షిప్ ఐడీ కార్డ్ ద్వారా రాబోయే మన ప్రభుత్వంలో మీకు మరింత గుర్తింపు వస్తుంది
గులాబీ జెండా ఎగురవేద్దాం మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం
